24.4 C
Hyderabad
Monday, March 16, 2026

Live Video

spot_img

విశాఖపట్నంలో ప్రేమజంట ఆత్మహత్య

విశాఖపట్నంలోని గాజువాక పరిధి పీలానగర్‌లో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. అమలాపురం ప్రాంతానికి చెందిన పిల్లి దుర్గారావు, సాయి సుష్మిత తాము నివాసం ఉండేప్రాంతంలోని ఓ ఆపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వీళ్ల ఇద్దరి కుటుంబాలు అమలాపురం నుంచి బతుకుదెరువు కోసం విశాఖకు వలస వచ్చి షీలానగర్ ప్రాంతంలోని వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్నారు.

ఈ క్రమంలోనే దుర్గారావు, సుష్మిత మధ్య పరిచయం ప్రేమగా మారింది. దుర్గారావు క్యాటరింగ్ నడుపుతుండగా, మృతురాలు సాయి సుష్మిత ఒక ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఆరు నెలలుగా అపార్ట్మెంట్లో ఉంటున్న పిల్లి దుర్గారావు వద్దకి
అప్పుడప్పుడు సాయి సుస్మిత అపార్ట్‌మెంట్ కు వచ్చి వెళ్తునట్టు సమాచారం. మృతులు ఇరువురు మధ్య వాగ్వాదం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఇంట్లో గాజు గ్లాస్, టీవీ రిమోర్ట్ పగిలిపోవడం పోలీసులు గుర్తించారు.

వీళ్ల వివాహానికి ఇరు కుటుంబాలు ఒప్పుకోకపోవడంతో మనస్తాపానికి గురైనట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే వారు ఇద్దరు ఓ అపార్ట్‌మెంట్ పైనుండి దూకడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. కాలనీ వాసులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి ఫోన్‌ లాక్‌ అవడంతో అన్‌లాక్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com