చైతు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో మోసెస్ మాణిక్‌చంద్ పార్ట్-2 టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. ఈ సినిమా గురించి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఇది వరకే ప్రకటించింది. విజనరీ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇది వరకు విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. చైతు ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా, కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌ను కూడా అందించారు. ఈ చిత్రానికి బొమ్మ బ్లాక్ బస్టర్ ఫేమ్ రాజ్ విరాట్ దర్శకత్వం వహించనున్నారు. నేచురల్ స్టార్ నాని సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించి, టీమ్‌కి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సినిమా డిఫరెంట్‌గా ఉండబోతోందని పోస్టర్‌ను చూస్తేనే తెలుస్తోంది. ఈ పోస్టర్‌లో మద్యం బాటిల్, క్లాప్‌బోర్డ్, అమ్మాయి, వైన్ గ్లాస్ ఇలా అన్నీ కనిపిస్తున్నాయి. పైగా ఈ చిత్ర పోస్టర్‌ను చిల్డ్రన్స్ డే సందర్భంగా రిలీజ్ చేస్తూ.. హ్యాపీ ‘నో చిల్డ్రెన్స్’ డే అని పెట్టారు. దీంతో మరింత ఆసక్తికరంగా మారింది.
చైతు జొన్నలగడ్డ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రాజకుర్చీపై రాజసం ఉట్టి పడేలా కూర్చుండగా.. భారీ ఆభరణాలు, స్టైలిష్ హెయిర్, లేత గడ్డం, సన్ గ్లాసెస్‌తో డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఒంటిపై ఆ టాటూలు పాత్ర తీరు, స్వభావాన్ని సూచించేలా ఉన్నాయి.