28 C
Hyderabad
Tuesday, March 10, 2026

Live Video

spot_img

మన్‌ కీ బాత్‌ తరహాలో “మీతో.. మీ చంద్రబాబు”

ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న మన్‌ కీ బాత్‌ కార్యక్రమాన్ని స్పూర్తిగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రజలతో నేరుగా మాట్లాడాలని భావిస్తున్నారు. వచ్చే సంక్రాతి పర్వదినాల్లో ప్రారంభించాలనుకుంటున్న ఈ కార్యక్రమానికి మీతో… ‘మీ చంద్రబాబు‘ అని నామకరణం చేశారు. ఈ కార్యక్రమానికి తుది రూపు ఇవ్వడానికి ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు డయల్ యువర్ సీయం అని దూరదర్శన్ సౌజన్యంతో నిర్వహించేవారు. ఈ కార్యక్రమం 2004లో టీడీపీ అధికారం కోల్పోయేంత వరకూ కొనసాగింది. అయితే ఇప్పుడు ప్రధాని మోడీ మన్ కీ బాద్, తన గత కార్యక్రమం డయల్ యువర్ సీయం కార్యక్రమాల సమ్మిళితంగా మీతో మీ చంద్రబాబు కార్యక్రమాన్ని రూపొందిచి ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి సిద్దమవుతున్నారు. త్వరలో ప్రజలతో ముఖాముఖీ సమావేశాలు నిర్విహింస్తామని బుధవారం అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ఆడియో, వీడియోల కలయికతో దీన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com