ధన్వంతరి ఫౌండేషన్ సంస్థ బాధితులు హైదరాబాద్‌లో నిరసన చేపట్టారు. సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన బాధితులంతా ప్ల కార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన తెలిపారు. ధన్వంతరి భాదితుల ఫోరమ్ ఆధ్వర్యంలో సీసీఎస్‌కు చేరుకున్న బాధితుఉల.. ఆ సంస్థ ద్వారా తమ దగ్గర కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టించుకొని బ్రాహ్మణులను మోసం చేసిన ఎండీ కమలాకర్ శర్మను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జనవరి 15లోగా బాధితులకు కట్టిన డబ్బులు చెల్లించకపోతే… సీసీఎస్ ముట్టడించడంతో పాటు… కమలాకర్ శర్మపై ప్రత్యక్ష దాడులకు దిగుతామని బాధితులు హెచ్చరించారు. కోర్టులో వాయిదాల పేరుతో కేసును నిరుగార్చే ప్రయత్నం కమలాకర్ శర్మ చేస్తున్నారని ఆరోపించారు. సీసీఎస్ లో కూడా పోలీసు అధికారులతో ఎండీ కుమ్మక్కయినట్లు అనుమానాలున్నాయి విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇందులో 3వేల మంది బాధితులు ఉన్నారని…దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు మోసం చేసారని ఆవేదన వ్యక్తంచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అగ్రిగోల్డ్ కుంభకోణం కన్నా ధన్వంతరి పెద్ద కుంభకోణం అని ఆరోపించారు. ధన్వంతరి ఫౌండేషన్ లో పలువురు ఐఎఎస్ , ఐపీఎస్ , ఐఎఫ్ఎస్‌లను డైరెక్టర్‌లుగా నియమించుకొని అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అనంతరం సీసీఎస్‌లో పోలీసు ఉన్నతాధికారులకు తమ మొర వినిపంచారు.
ధన్వంతరి ఫౌండేషన్ బాధితుల నిరసన
- Advertisement with us -