ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.. పలువురు కేంద్రమంత్రులను కలుస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశలపై చర్చిస్తున్నారు. పెండింగ్ అంశాలు త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలను సాదరంగా ఆహ్వానించారు. ఇద్దరినీ సగౌరవంగా సత్కరించారు. జ్ఞాపికలు అందజేశారు.
ఈ సందర్భంగా.. రాష్ట్రంలో ప్రతిపాదనలో ఉన్న విమానాశ్రయాలు, పెండింగ్ అంశాల గురించి రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. రేవంత్, విక్రమార్క చెప్పిన అంశాలను సావధానంగా విన్న కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు.. తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన అన్ని అనుమతులు, నిధులు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు.